అచ్చమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం:
- తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా.. ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం
- చూడగానే తెలంగాణ తల్లి మన ఇంటి ఆడబిడ్డ అవతారం ఎత్తినట్లుగా కనిపించే ముఖారవిందం
- మెడలో బంగారు తీగ – ఎన్ని ఆభరణాలున్నా, తెలంగాణ ఆడబిడ్డలు మెడలో ఈ తీగను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా, ఎంతో ఇష్టంగా ధరిస్తారు.
- కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ.. ఎడమ చేతిలో తెలంగాణలో శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా పండించే ముఖ్యమైన పంటలను ధరించి, తెలంగాణలో వ్యవసాయానికి గల ప్రాముఖ్యతను చాటి చెబుతుంది.
- తెలంగాణ గ్రామీణ జీవన విధాన ప్రాముఖ్యతను , తెలంగాణ ఆర్థిక ప్రగతికి మూల స్తంభమైన వ్యవసాయంలో ఆడబిడ్డల ప్రాముఖ్యతను చాటి చెబుతుంది.
- వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను , ఎరుపు రంగు చాకలి ఐలమ్మలాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని సూచిస్తాయి .
- తెలంగాణ తల్లిని బిడ్డలందరూ తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నట్లుగా తెలిపే విగ్రహ పీఠం
- విగ్రహ పీఠంలో, తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన తెలంగాణ బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్లు.
- తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం.