డిసెంబర్ 2:చిట్యాల మండలం ఏలికట్ట గ్రామాం గుండె యుగేందర్వెలిమినేడు గ్రామాం వాసి అంతటి శశి ప్రకాష్,గుండ్రంపల్లి గ్రామాం రుద్రరాపు కావేరి, ముగ్గురు విద్యార్డులకు ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగింది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధక్ష్యలు గుడిపాటి లక్ష్మి నర్సింహా గారు మంత్రి గారి దృష్టి కి తీసుకొని వెళ్లడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైదరాబాద్ లో తన నివాసంకి తీసుకొనిరామని చెప్పడం, తాను ఈ ముగ్గురు విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముగ్గురు విద్యార్థులకు ఒక ఒక్కరుకి చొప్పున 65,000 వారి కాలేజీ అకౌంట్స్ కి వేయడం జరిగింది… ఇలా ఐదు సంవత్సరాలు చదువులకు పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం చదువులకు కావల్సిన ఆర్ధిక సహాయం అందించారు మంచిగా చదువుకొని డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాని భరోసా కల్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందనతో విద్యార్ధుల తల్లీతండ్రి లు సంతోషించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడారు..మేము ఎవరమో తెలియకపోయినా సార్ మా కష్టం తెలుసుకొని..నా చదువులకు అండగా ఉంటానని చెప్పారు.చేయడమే కాదు..ఐదేండ్లు నా చదువుల బాధ్యత తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి సార్ చెప్పడం మాకు చాలా సంతోషం కలిగించింది నాలాంటి ఎందరో విద్యార్ధుల చదువులకు అండగా నిలబడుతున్న కోమటిరెడ్డి సార్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని,నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారిని,ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బీర్ల ఎల్లయ్య గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కారిక్రమంలో గుండ్రంపల్లి మాజీ ఎంపీటీసీ బండ గిరిజ అంజయ్య , ఉరుమడ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు , గుడిపాటి శివ సాయి వెంకట వర ప్రసాద్ , విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు