డిసెంబర్ 2:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి, మరియు నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్లు కలిశారు.. ముఖ్యమంత్రి గారు అక్క బాగున్నావా ఆంటూ ఝాన్సీ రెడ్డి గారిని అప్యాయంగా పలకరించారు.
ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి గారిని పలకరిస్తూ యంగ్ లీడర్ అంటూ సంబోధిస్తూ పాలకుర్తి ఐలమ్మ అని ఆప్యాయంగా పలకరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి గార్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం.. సంక్షేమం కోసం చేయూతను అందించాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పనులు రైతుల రుణ మాఫీ, కెనాల్ కాలువలు, పూర్తి రోడ్లు మరమత్తులు, నియోజకవర్గ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు కావాల్సిన నిధులు త్వరలో మంజూరు చేస్తున్నాను హామీ ఇచ్చారు..
Posted inBlog