డిసెంబర్ 2: రాజేంద్ర నగర్ నియోజక వర్గ పరిధిలోని రాజేంద్ర నగర్ లోని RDO కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ రాజేంద్ర నగర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులతో కలిసి RDO గారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేందుకు అనేక రకాల గ్యారంటీ లను ఇచ్చి వాటిని నెరవేర్చడం లో కాంగ్రెస్ పూర్తి గా విఫలమైందని రెవెన్యూ డివిజన్ అధికారి గారిని వినతి పత్రం అందజేయడం జరిగింది. సందర్బంగా వారు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది మరి ఆనాడు సుజుకి సమయంలో ఆరు గ్యారెంటీ మరియు 66 హామీలను చెప్పేసి సోనియాగాంధీ సంతకం పెట్టి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తావని ప్రజలకు చెప్పి మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఈ ఆరు గ్యారెంటీలు గాక ఆరు మోసాలు గా మరినాయి. 66 హామీలు కూడా 66 మోసాలు గా మరిని విషయం ప్రజలందరు గమనిస్తున్నారన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఇచ్చిన 1). గృహ జ్యోతి, 2). మహాలక్ష్మి పథకం,3). సొంత ఇంటి పథకం, 4). యువతకు ఉపాధి హామీ, 6). వృద్దులకు అందని చేయూత అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఎ ఒక్క పథకం కూడా ప్రజల వద్దకు తీసుకొకుండా, ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఏదో చేసినం ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను, అమలు చేసినం, ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయినము ప్రజలను ఉద్దరించినము, ప్రజలను అభివృద్ధి చేసినం అన్నటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నది ఈరోజు ఏ వాగ్దానాలు అమలు చేశారు ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆరు హామీలు 66 గ్యారెంటీలు 100 రోజుల లోపు ప్రజలకు అందజేస్తాం మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఏదైతే రైతు రుణ మాఫీ అన్నారు. ఈరోజు కూడా సగం మంది రైతులకు రుణ మాఫీ పూర్తి అమలు చేయలేదన్నారు. అది కూడా ఊరికి ఊరికి 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా దానిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే కాకుండా దాంతో పాటు ఏవైతే హామీలు ఉన్నాయో రైతుబంధు అనే కార్యక్రమంలో భరోసా కార్యక్రమం గా కూడా అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీల గురించి అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే ఈరోజు అర్ధాంతరంగా కేసులు పెట్టి, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వేధించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఈరోజు పేదల భూములు గుంజుకోవడం ప్రయత్నం, ఈరోజు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం, మూసి సుందరికరణ మూసి ప్రక్షాళన పేరుతో ఈరోజు పేదల ఇళ్లను గుంజుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాబట్టి ఈరోజు సంవత్సరం పూర్తయిన నాక్కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయనందువలన యొక్క వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్య వంతం పరిచి ఈరోజు ప్రజలు వెంట, ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు. కచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కచ్చితంగా నెరవేరుచేంతవరకు ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలియజేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాము ఈరోజు అనేక గ్యారంటీ లు 6 గ్యారంటీలు 100 రోజుల లోపు అమలు చేస్తామని ప్రజలకు చెప్పడం, 66 హామీలు గాని సంవత్సరం పూర్తవుతున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల 66 హామీలను నెరవేర్చేదాక ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగు తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోకల శ్రీనివాస్ రెడ్డి, బొక్క నరసింహ రెడ్డి, అంజన్ కుమార్, బొక్క వేణుగోపాల్, అసెంబ్లీ ఇన్చార్జి, మల్లేష్ యాదవ్, మల్ల రెడ్డి, కొమ్రయ్య, మొండ్ర సంగీత, లక్మి నారాయణ, బొక్క బల్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ అత్తాపూర్ విజయ్, ఆడికే జనార్ధన్, మహేష్ యాదవ్, భిక్షపతి యాదవ్, భీం అర్జున్ రెడ్డి, జోగి రవి, సత్యనారాయణ, వెంకటేష్, ప్రశాంత్ నాయక్, భువనేశ్వర్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.