నవంబర్ 30 హైదరాబాద్: ప్రజా ఉద్యమంలో ముందుండే నాయకుడు…
ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కాకా వారసుడు…
చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రజా రక్షకుడు.చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు! ఉద్యమాల్లో అనుభవం, రాజకీయాల్లో అంకితభావం కలిగిన ప్రజా నాయకుడు, కాకా గారి వారసత్వాన్ని సజీవం చేస్తూ, ప్రజల హృదయాల్లో నిలిచిన గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అజేయ పాత్ర పోషించిన ఆయన, ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం చేసిన సేవలు మరువలేనివి.తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన వివేక్ వెంకటస్వామి గారు ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గానికి అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నాయకుడు. ప్రజల సమస్యలను ముందుండి పరిష్కరించడానికి కృషి చేస్తూ, అవినీతిని తట్టుకుంటూ న్యాయపాలన అందిస్తున్న నేతగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, ఆయన చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో భాగస్వామిగా ప్రజల కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.