గురుకుల పాఠశాలను సందర్శించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించిన శ్రీరాములు అందెల

గురుకుల పాఠశాలను సందర్శించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించిన శ్రీరాములు అందెల

నవంబర్ 29:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కందుకూరు మండల గురుకుల పాఠశాలను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడుతూ మరణిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 51 విద్యార్థులను పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకులాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్షించాలి, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించాలి, ప్రతి గురుకులాలలో మంచినీటి సరఫరా కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, స్నానపు గదులు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశించాలి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలకు జిల్లా కలెక్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీరాములు కోరారు. అనంతరం ప్రిన్సిపల్ గారు తమ గురుకుల పాఠశాల యొక్క ఇబ్బందులను, పరిస్థితులను శ్రీరాములు గారికి తెలియజేశారు ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపించిన తమ సమస్యలు తీరడం లేదని ప్రిన్సిపల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి గారు, కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గారు, సహకార బ్యాంకు డైరెక్టర్లు పెత్తుల పుల్లారెడ్డి, తోట ప్రతాప్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు ఏనుగు రామ్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, మంత్రి మహేష్ ముదిరాజ్, జిల్లా బీజేవైఎం నాయకులు ఇల్లందుల సాయి సంతోష్, యాతం వెంకటేష్, కీసర శ్రీకాంత్ రెడ్డి, గడ్డం శ్రీకాంత్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పవన్ కుమార్, ప్రవీణ్ గౌడ్, మల్లెల మహేందర్, శివప్రసాద్ బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *