నవంబర్ 24:వయనాడ్ నుంచి 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన ప్రియాంకగాంధీ.ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచించి ఓటేస్తారని భావించానన్న నవ్య హరిదాస్ దురదృష్టవశాత్తూ బీజేపీ గెలవలేదన్న నవ్య హరిదాస్.వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో దురదృష్టవశాత్తూ బీజేపీ గెలవలేదని ఆ పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ సమీప సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. ప్రియాంక గాంధీకి 6,17,942 ఓట్లు రాగా, సీపీఐ అభ్యర్థికి 2,09,906 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు 1,09,202 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.వయనాడ్‌లో ఓటమిపై నవ్య హరిదాస్ స్పందించారు. అభివృద్ధి గురించి ఆలోచించి ప్రజలు ఓటేస్తారని తాము భావించామని, కానీ పోలింగ్ శాతం తక్కువగా నమోదైందన్నారు. తమను గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్పామన్నారు. కానీ బీజేపీ గెలవలేదన్నారు.
వయనాడ్‌లో విద్య, వ్యవసాయ, మెడిసిన్… ఇలా అన్ని రంగాలు కూడా వెనుకబడ్డాయన్నారు. ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు ప్రియాంకను గెలిపించినా ఆమె అప్పుడప్పుడు వస్తారని అభిప్రాయపడ్డారు.