ఈ లోకంలో గురువు గొప్పతనం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

ఈ లోకంలో గురువు గొప్పతనం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

సెప్టెంబర్ 12:ఓ యువకుడు ఆశ్రమానికి వెళ్లి తనని శిష్యుడిగా స్వీకరించమని గురువుని వేడుకు న్నాడు. గురువు అతని వైపు చూశాడు. పొయ్యి పక్కనున్న వెదురు బుట్టను చూపించి, నదికి వెళ్లి నీళ్లు తీసుకురా… అన్నాడు. దీంట్లో నీళ్లెట్లా నిలుస్తాయి? అనుకున్నాడా యువకుడు. కానీ గురువును ప్రశ్నిస్తే ఆయన ఆజ్ఞను ధిక్కరించినట్లు అవుతుందనుకుని నదికి వెళ్లాడు. బుట్టలో నీళ్లు నింపి వొడ్డుకు రాగానే అన్నీ కారిపోయాయి. మళ్లీ బుట్టలో నీళ్లు నింపి ఈసారి వేగంగా నడిచాడు. కొన్ని అడుగులు వేయకముందే బుట్టలో నీళ్లన్నీ నేలపాలయ్యాయి. నడిస్తే లాభం లేదనుకొని నీళ్ల బుట్ట తలపై పెట్టు కుని పరిగెత్తాడు. అయినా నీళ్లు కారిపోయాయి. అలా చాలాసార్లు ప్రయత్నించి శారీ రకంగా అలసిపోయాడు. మానసికంగా విసిగిపోయాడు. చేసేదేం లేక ఖాళీ బుట్ట తీసుకొని గురువు దగ్గరికి వెళ్లి తన నిస్సహాయతను వెలిబుచ్చాడు.అప్పుడు గురువు ‘వెదురు బుట్టలో నీళ్లు నిలవవని నాకూ తెలుసు. కానీ నువ్వు ప్రయత్నం చేయడం వల్ల బొగ్గు మసితో నల్లగా ఉన్న వెదురు బుట్ట శుభ్రపడి తెల్ల బడింది. నల్లనిబుట్ట లాంటిదే మన మనసు కూడా. అది పరిశుభ్రంగా ఉంచితేనే ఏ విద్యలో అయినా పరిపూర్ణత సాధించవచ్చ’ని చెప్పాడు.ఆత్మ విద్యను ఉపదేశించమని యమ ధర్మరాజుని కోరతాడు నచికేతుడు. దానికి బదులు దీర్ఘాయుష్షును, అక్షయ సంపదను, ఆధిపత్యాన్ని… ఇలా ఏది కోరినా తీరుస్తానని ఆశ చూపుతాడు యమధర్మ రాజు. కానీ నచికేతుడు వేటికీ లొంగలేదు. అతని దృఢచిత్తాన్ని మెచ్చుకొని ఆత్మ విద్యను బోధించాడు యముడు.

గురువు అంటే మార్గదర్శి నిజమైన గురువు జ్ఞానంలో నిష్ణాతుడు, అసూయ లేనివాడు, సరళ జీవితాన్ని గడిపేవాడు. ఆత్మజ్ఞానాన్ని పొందినవాడై ఉండాలని ఉప నిషత్తులు చెబుతున్నాయి. గాంధీజీ అన్నట్లు- అజ్ఞాన చీకట్లను తిమిరాలను పారదోలి, విజ్ఞాన జ్యోతులను వెలిగించి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి విజేతలుగా మల చటం అధ్యాపకులకే సాధ్యం. మాతృభాష, సంస్కృతులను నేర్పి మాతృదేశాన్ని గౌరవించే పౌరులను పెంపొందించే మహోన్నతులు గురువులే!

ఎవరి మనసు నిర్మలంగా నిశ్చలంగా నిగ్రహంతో ఉంటుందో అటువంటి విద్యార్ధి జ్ఞానబోధకు అర్హుడని ఉపదేశసారం చెబుతోంది. చీకటి నుంచి వెలుగువైపు నడిపించే నిత్యసత్యమే గురువు. అందుకే గురువుని ‘అనంత జ్ఞాన గగనం’ అన్నారు.

అలెగ్జాండర్ను ఓ వ్యక్తి మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? మీ తల్లిదండ్రులనా? గురువునా? అని ప్రశ్నించాడు. అందుకు అలెగ్జాండర్ ‘నిస్సందేహంగా నా గురువునే. తల్లిదండ్రులనే వారు నన్ను దివినుంచి భూమికి తీసుకొచ్చారు. కానీ గురువుని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. నన్ను తిరిగి భువి నుంచి చిరకీర్తి అనే దివికి పంపించగల మహిమాన్వితుడు ఆయనే కాబట్టి’ అని చెప్పాడు.

తల్లిదండ్రులు జన్మనిచ్చి ఈ బాహ్య ప్రపంచంలోకి చేర్చితే గురువు జ్ఞానమిచ్చి అంతర్ముఖ ప్రపంచంలోకి చేరుస్తాడు. తలను నిమిరి లాలించేది తల్లిదండ్రులైతే మన తల వ్రాతలను మార్చి పాలించేది ఒక్క గురువు మాత్రమే. అందుకే తల్లి ప్రేమ సరస్సు లాంటిదైతే గురు ప్రేమ సాగరం లాంటిది అన్నారు.
మీ🙏శ్రేయోభిలాషి

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *