చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్!
‘హైడ్రా’ కమిషన్ రంగనాథ్‌ను HMDA పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ORR వరకు ఉన్న జలవనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువులను పరిరక్షించే బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.