ఆగస్టు 26:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.