గోల్కొండ జూలై 7:ఆచారం ప్రకారం గోల్కొండలో తొలిబోణం కుమ్మర్లు సమర్పించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ గారిని ముఖ్యఅతిథిగా అహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ తొలిబోణంపై దీపం వెలిగించి, బోనం ఎత్తుకొని ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాదులో ఉన్న ప్రజలు చల్లగా ఉండాలని వందల సంవత్సరాల నుంచి బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ లో మొట్టమొదటి బోనాన్ని కుమ్మరులు సమర్పిస్తూ వస్తున్నారు.
మైసూర్ కేంద్రంగా పరిపాలన చేసిన ప్రజాపతి సమాజం గొప్ప చరిత్ర కలిగిన వారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడవేసేందుకు దేవుడే దిక్కు అని అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ 516 బోనాలతో తొలీబోణం సమర్పిస్తున్న సందర్భంలో ఈ కుమ్మర సమాజానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.దీని తర్వాతనే హైదరాబాదులో లాల్ దర్వాజ, ఉజ్జయిని, తదుపరి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించే సంప్రదాయం ఉంది.అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము..
పేద ప్రజానీకానికి మీరు అండగా ఉండి చల్లగా చూడాలని కోరుతున్నాము. ప్రజలకు ఏ కష్టం లేకుండా, దుఃఖం బాధ లేకుండా.. మంచి పాడి పంటలతో సుఖంగా జీవించే భాగ్యం కలిగించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో ప్రజాపతి సంఘం వారితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేస్తున్న శైలజ, ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కృష్ణ, బీసీ సమాజ్ అధ్యక్షుడు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
Posted inSTATE