ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ నేలపై బోనాల సంబురాలు మొదలవుతాయి. నెత్తిన బోనం కుండలతో, ఘటాలతో…. పోతురాజుల విన్యాసాలతో, ఫలహారపు బళ్లతో భాగ్యనగర వీధులన్నీ కళకళలాడుతాయి. తల్లీ బైలెల్లినాదో… చల్లంగ మమ్మేలు మాయమ్మో… అంటూ జానపదుల పాటలు హుషారెత్తిస్తాయి. వర్షకాలంలో వచ్చే మహమ్మారులు నుంచి కాపాడమని జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. పంటలు వృద్ధి చెందాలని, ప్రతి ఇల్లు పిల్లాపాపలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రతి ఆదివారం బోనాల పండుగ చూసేవారికి చూడవేడుకగా సాగుతుంది.బోనాలు.
ముఖ్యతేదీలు:
జూలై 7 – గోల్కొండ బోనాలు
జూలై 9 – బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
జూలై 21 – ఉజ్జయిని మహంకాళి బోనాలు
జూలై 28 – లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు
జూలై 29 – అమ్మవారి ఘటాల ఊరేగింపు
Posted inSTATE