ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు జిల్లాలో పరిష్కారానికి ఎదురుచూస్తున్న అనేక సమస్యలు.హైదరాబాద్: సుదీర్ఘ కాలం తర్వాత,రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం
ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి,చంద్రబాబునాయుడు శనివారం సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది. ఈ భేటీలో రెండు
రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు
చర్చించనున్నారు. విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ ఏపీ సీఎం.
చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించడం తెలిసిందే. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది. సుహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరుగుతున్న ఈ సమావేశం ఫలవంతం
కావాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.
Posted inSTATE