విదేశాల్లో ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. కాగా.. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని, 132 మంది కూర్చునే విధంగా రూపొందిస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.
Posted inNATIONAL