దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సేవలను మరింత విస్తరిస్తున్నట్టు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్పారు.గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బ్యాంకు 137 కొత్త బ్రాంచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిందని, అందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు.
.