కాంగ్రెస్ గూటికి చేరిన బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ గూటికి చేరిన బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ఊరి న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి వి.సచిన్ కుమార్ :బాన్స్వాడ నియోజకవర్గానికి సరైన కాంగ్రెస్ నాయకులు లేరు అని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డిని బాన్సువాడకు అధిష్టానం పంపింది. బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ కూడా ఇచ్చింది. పోచారం చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగుల రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నియోజక వర్గం బాధ్యతలు చేపట్టిన వారే ఎమ్మెల్యేలు, మంత్రులు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం బాన్స్వాడలో రాజకీయ సమీకరణలు ఒకేసారి మారిపోయాయి. భార స సీనియర్ నాయకులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరుతున్న నేపథ్యంలో, బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి పరిస్థితి ఏమిటని? ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఏనుగుల రవీందర్ రెడ్డిని నమ్ముకుని ఎంతోమంది బారస నాయకులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకం…చేర్చుకోవడానికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. 30 ఏళ్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి కింద కొంతమంది నలిగిపోయి, దూరమై కాంగ్రెస్ పార్టీలోకి చేరితే మళ్ళీ ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. మళ్లీ పోచారం పీడా మాకు తగిలించారు అంటూ ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఏళ్లుగా బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనం పడి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు, వారి కొడుకుల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నలిగిపోయారు. కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బాన్స్వాడ నియోజకవర్గంలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సవంతో ఉప్పొంగిపోయారు. ఇంకేముంది మళ్లీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతోపాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ కుమారులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరితే బాన్స్వాడ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. భాజపా బలోపేతం కానుందిమాజీ శాసనసభాపతి 30 ఏళ్లుగా బాన్స్వాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యమైస్తున్నాం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు మళ్లీ కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని మన దినపత్రిక రెండు రోజుల క్రితమే కథనం ప్రచురించింది. మన దినపత్రిక ఊహించిన విధంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరడానికి అన్ని దారులు తెరుచుకున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, భారత 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటిలోకి చేరబోతున్నారు. ఈనెల 29న ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇప్పటివరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారా? లేక బారాసాలోనే కొనసాగుతారా అన్న సందిగ్ధం నెలకొంది. దీనిని పటాపంచలు చేస్తూ శుక్రవారం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి తన పార్టీలోకి రావాలంటూ సాధారణంగా ఆహ్వానించారు . దీనికి మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటిలోకి చేరిపోతున్నారు. ఇప్పటివరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకూడదు అంటూ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. వీటిని అన్నిటిని పక్కనపెట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *