ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజులపాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించ నున్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ.. జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
కాగా శుక్రవారం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈసందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్‌లో జరుపుకో నున్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఆయన యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.
యోగా దినోత్సవానికి ముందు ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు యువతతో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొన్ని ఉగ్రవాద ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన దృష్ట్యా, మొత్తం శ్రీనగర్‌ను రెడ్ జోన్‌గా మార్చారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్, దాల్ సరస్సు చుట్టూ పక్షులు కూడా తిరగలేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా ప్రధాని తన పర్యటన లో జమ్మూ కాశ్మీర్‌కు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 21న ఉదయం 6:30 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
2015 నుంచి ప్రతిఏటా యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు ప్రధాని నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూర్, న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక ప్రదేశాలలో యోగా దినోత్సవ వేడుకల కు ఆయన నాయకత్వం వహించారు.
ఈ ఏడాది యోగా దినోత్స వం థీమ్ ‘యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ’, వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించ డంలో దాని ద్వంద్వ పాత్రను హైలైట్ చేస్తుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అట్ట డుగు స్థాయి భాగస్వామ్యా న్ని, యోగా వ్యాప్తిని ప్రోత్స హిస్తుందని పీఎంఓ తెలిపింది.