న్యూ ఢిల్లీ :జూన్ 02
తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు లొంగిపో యారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతు లతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేటితో జూన్ 2 మధ్యంతర బెయిల్ గడువు ముగియ డంతో తిరిగి జైలుకు వెళ్లారు.
కాగా అనారోగ్యం కారణంగా తనను ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేజ్రీవాల్ ఇంటినుంచి బయలు దేరిన తరువాత మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందారు. లొంగిపోయే ముందు ఆయన ఆప్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతల తోచర్చించి.. ఆ తర్వాత తీహార్ జైలులో లొంగిపోయారు.