డిసెంబర్ 03 చేవెళ్ల: పనులు ప్రారంభం అయ్యే వరకు ఆందోళనలు అగవు.పార్టీలకతీతంగా ఉద్యమిస్తాం-ప్రజల ప్రాణాలు కాపాడుదాం.బీజాపూర్ హైవే పై నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలను పట్టించుకోవాలని,వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని పెద్ద ఎత్తున ఆల్ పార్టీ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు.ప్రజల ప్రాణాలు పోతున్న అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నారు అని మండిపడ్డారు.రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని చేవెళ్లలోని వివిధ గ్రామాల ప్రజలందరూ రోడ్లపై కొచ్చి ధర్నా నిర్వహించారు.రోడ్లపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.చేవెళ్ల తో పాటుగా ఆలూరు స్టేజీ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలకు దిగటంతో వికారాబాద్-హైదరాబాద్ రహదారి స్తంభించింది.
దాంతో పోలీసులు సిద్ధులూర్ ఎనికేపల్లి గేటు మీదుగా వాహనాలు మళ్లించారు.