డిసెంబర్ 2: గద్వాల పట్టణ సమీపంలో గల సంగాల రిజర్వాయర్ ద్వారా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కృష్ణమ్మ తల్లి కి పూజలు నిర్వహించి నీటి విడుదల చేయడం జరిగినది.
ఎమ్మెల్యే గారికి రైతులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతుల పండించిన వరి ధాన్యంలో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రైతుల అభివృద్ధి కోసం సీఎం గారు రైతులకు రైతుబంధు రైతు రుణమాఫీ సున్న కారు రైతులకు 500 రూపాయలు బోనస్‌లను అందిస్తున్న అని పేర్కొన్నారు.
⚡గత 6 సంవత్సరం లాగానే సంఘాల చెరువు ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. గద్వాల మండల పరిధిలోని పలు గ్రామాలకు అదేవిధంగా గద్వాల పట్టణానికి కూడా సంఘాల చెరువు నీటిని ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు ప్రతి సన్నకారు రైతులకు సాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
రైతులు నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని సూచించారు.
👉ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గడ్డం కృష్ణారెడ్డి ,రమేష్ నాయుడు, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్ మురళి కృష్ణ శ్రీను నరహరి గౌడ్, రిజ్వాన్, నాయకులు గోవిందు, కురుమన్న, వంట భాస్కర్, లక్ష్మన్న, దౌలన్న, జగదీశ్వర్ రెడ్డి, గువ్వల గోపాల్, వెంకటస్వామి , వెంకటేష్ , నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.