డిసెంబర్ 1:మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటికై ఏర్పాటు కానున్న 300 ఫీట్ల రోడ్డు కోసం భూములను కోల్పోతున్న రైతులు ఈరోజు ఉదయం కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి తమ ఆవేదనను తెలియజేస్తూ, తమకు అండగా నిలబడాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేపట్టే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రైతులు ఎవరూ కూడా అధైర్య పడొద్దని వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, మాదారం రమేష్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.