సరిగ్గా 15 సంవత్సరాల క్రితం తెలంగాణ మలిదశ ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తునా ఎగిసింది అదే మన శ్రీకాంత్ చారి వీరమరణం(03-12-2009).
ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత ఉద్యమించినా.. ఎన్ని పోరాటాలు చేసినా.. ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రావట్లేదని తలచి.. తెలంగాణ తల్లికి తన అత్మార్పణంతోనైనా పాలకుల మనసుల్లో చలనం వస్తుందని భావించాడు. తన ఆత్మాహుతితోనైనా తెలంగాణ ఉధ్యమ జ్వాలలు హస్తినకు తగులుతాయని ఆకాంక్షించాడు. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో నడి రోడ్డు మీద.. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. 2009 డిసెంబర్ 3 న శ్రీకాంతా చారి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
జోహార్ శ్రీకాంత్ చారి
జై తెలంగాణ జైజై తెలంగాణ