నవంబర్ 30: హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధి కొరకు ఈరోజు హైదరాబాద్ లోని ఉత్తంకుమార్ రెడ్డి గారి నివాసంలో హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు ఆదేశించారు. హుజూర్ నగర్ లోకల్ లో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి అని కోర్టు వివాదంలో ఉన్నటువంటి ఇండ్ల యజమానులను పిలిపించి వారితో మాట్లాడి తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని. అదేవిధంగా హుజూర్నగర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కొరకు 28 వార్డులలో ప్రణాళికలు తయారు చేయాలని, మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి బేషజాలకు పోకుండా అభివృద్ధి విషయంలో అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని, రాష్ట్రంలోనే హుజూర్నగర్ మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 19 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వల్లపుదాస్ కృష్ణ గౌడ్ ,25వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సులువ చంద్రశేఖర్,యువ నాయకులు