నవంబర్ 11 న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమి తులయ్యారు. సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ సీజేఐ ఎన్వీరమణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనసాగనున్నారు. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక తీర్పులిచ్చారు.న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి సంజీవ్ ఖన్నా న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారం ముగియడంతో సంజీవ్ ఖన్నా పదవీ బాధ్యతలు చేపట్టారు.