ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ హైదర్గూడా హైదర్ షాకోట్ ప్రాంతాలలో
మూసి బాధితుల కొరకై ఒకరోజు నిద్ర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు MLC జనార్దన్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారు రాజేంద్రనగర్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క కొమరన్న గారు అంజన్ కుమార్ గారు మూసి పరిసర ప్రాంతాల్లోని బాధితులకు ఇంటింటికి వెళ్లి భరోసా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులు పక్కనపెట్టి రేవంత్ రెడ్డి వారు చేసిన నీతిమాలిన వాక్యాలు మీరు వెళ్లి అక్కడ ముసి ప్రాంతంలో బస చేసి నిద్ర చేసి రండి అని చెప్పడం దానికి దీటుగా ప్రజలకు భరోసా కనిపిస్తూ బిజెపి నాయకులు అందరూ కలిసి పరిసర ప్రాంతాలలో బస చేస్తూ
మూసీ ప్రక్షాళన చేయండి..
కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి!
కాంగ్రెస్ పార్టీ కర్కశ పాలనలో పేదలకు గూడు – నీడా దూరమవుతుంది.
మూసీ ప్రక్షాళన – సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు పడగొట్టి, బడాబాబులకు ఆ జాగాలను అందచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.
రేవంత్ రెడ్డి సవాలుకు బదులుగా మూసీ పరివాహక ప్రాంతాలలో నివాసముంటున్న బాధితుల ఇండ్లల్లో, వారితో పాటు మమేకమై జీవించి.. వారికి అండగా బిజెపి ఉందని భరోసానిచ్చేందుకే బిజెపి మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టింది అని తెలిపారు