నవంబర్ 30 హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆస్ట్రియా రాయబారి కేథరినా వేజర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల ఆస్త్రియా రాయబారి గారు ఆసక్తి కనబరిచారు.