నవంబర్ 30 హైదరాబాద్:
“పుట్టువొకటే గాని మరణము
వుండదెప్పుడు మహాకవులకు
మృత్యుజితుడై వెలుగులీరెడు
అడుగుజాడకు నమస్సుల్
జనులబాసకు జేలు పలుకుచు
జాగృతించెను తెలుగుజాతిని
సరళసుందర ఛందమందున
కూర్చిచూపెను మేలుగీతిని
ఛందరాజము లెన్ని వచ్చిన
చంద్రతారార్కమ్ము నిలుచును
మేటి గురజాడ “ముత్యాలస
రమ్ము” శాశ్వతముగా” !
*షుకూర్..
తిక్కన తన కాలంలో కొనసాగుతున్న ….పడికట్టు
భాషను సంస్కరించి జనం మాట్లాడుకునే భాష
ను ఎలాగైతే ప్రజాబాహుళ్యంలోకితెచ్చాడో….
గురజాడ కూడా తనకాలపు తెలుగుభాషకుకొత్త
రూపురేఖలు ఇచ్చి సరికొత్త నడక నేర్పాడు. ఫలితంగా “ముత్యాలసరాలు”తెలుగువారికి గురజాడ వరాలుగా లభించాయి.1910 జూలైలో ఆంధ్రభారతి పత్రికలో ఈ ముత్యాల సరాలు ప్రచురితమయ్యాయి.
కవిత్వం ప్రజలకు అర్థంకాని భాషలో వుండరాద
నిప్రజలు మాట్లాడుకునే తేటతెలుగులోనే వుండా
లని, అప్పుడే అది ప్రజల దగ్గరకు చేరుతుందని గురజాడ భావించారు.
“గుత్తునా ముత్యాలసరములు
కూర్చుకొని తేటైన మాటల
క్రొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెరుగులు జిమ్మగా “….
అంటూ కొత్తొక వింత,పాతొక రోత అన్నట్లు కాకుం
డా కొత్త పాతల మేలు కలయికతో రచించబట్టే ముత్యాలసరాలు ఈనాటికీ వెలుగులుజిమ్ము
తున్నాయి.అయితే కొత్త మార్పుల్నిలోకం ఒక్క
సారిగా మెచ్చదు కదా! ఆ విషయం గురజాడకు బాగా తెలుసు.అందుకే సనాతనులు తనప్రయత్నా
న్ని హర్షించకపోయినా గురజాడ మాత్రం మడమ
తిప్పలేదు.తాను నమ్మిన పద్ధతిలోనే కవిత్వం రాశాడు.ప్రజల భాషకు పట్టం కట్టాడు.
“ మెచ్చనంటావు నీవు నీవిక
మెచ్చకుంటే మించిపాయెను
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలుల సౌరెక్కునా “.
అంటూ ఎవరు మెచ్చుకున్నా,ఎవరు నొచ్చుకున్నా వెనకాడేది లేదని తనదైన మార్గంలో అడుగు ముందుకేశాడు.వసంతకాల ప్రారంభంలో లేచిగుళ్ల
ను తిన్న కోయిలలా నూతన ఛందస్సులో
ముత్యాలసరాల్ని గురజాడ గుదిగుచ్చాడు.
సహజంగానే గురజాడ సంఘసంస్కర్త.సాహిత్య
కారుడూ కావటంతో తన రచనల్లో సంస్కరణలకు పెద్ద పీటేవేశాడు.సమాజంలో ఏదైన మార్పు తల
పెట్టినపుడు ముందుగా అది మన ఇంటినుంచే మొదలైతే ఫలితంబాగుంటుంది.ఇదే విషయాన్ని గురజాడ తన ముత్యాలసరాలకు ఇతివృత్తంగా చేశాడు.తాము తలపెట్టినసంస్కరణల్ని ఇంట్లో
వుండే భార్యాబిడ్డలకు చెప్పి ఒప్పించలేనివారు సమాజాన్ని ఎలా ఒప్పిస్తారు.నీతులుచెప్పే వారు ముందుగా వాటిని పాటించి,ఆతర్వాత లోకానికి చెప్పాలని గురజాడ నమ్మేవాడు.
ముత్యాలసరాల ఇతివృత్తం ప్రకారం “ ఒక సంఘసంస్కర్త తాను తలపెట్టిన సంస్కరణల్ని సమాజానికి చెప్పిఇంటికి తిరిగొస్తాడు.ఆవిషయా
న్ని భార్యకు కూడా చెబుతాడు.అయితే ఆవిష
యాలు తనకు నచ్చలేదని భర్తముఖంపైనే చెబు
తుంది. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు కానీ తాము ఆచరించడానికి కాదన్న లోకానుభవాన్ని
భార్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు గురజాడ.
సమాజంలోని అంటరానితనాన్ని గురజాడ నిర
శించాడు.మాల,మాదిగల పట్ల నిజంగా ప్రేమ,
అభిమానం వుంటే ఏం చేయాలో గురజాడ స్పష్టంగా చెప్పారు
“కలసి మెసగిన యంత మాత్రానె
కలుగబోదీ యైకమత్యము
మాల మాదిగ కన్నెనెవతెనో
మరులుకొనరాదో……….”.
కేవలం చెప్పటం కాదు.,ఆచరణలో చేసి
చూపించడం ముఖ్యమన్న విషయాన్ని
మనసుకు హత్తుకుపోయే కథనంతే 29 ముత్యాలసరాల్లో గురజాడ చెప్పిన తీరు ప్రశంసనీయం.
“మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్. “
“తూర్పు బల్లున తెల్లవారెను
తోక చుక్క యదృశ్యమాయెను
లోకమందలి మంచి చెడ్డలు
లోకు లెరుగుదురా..”
గురజాడ అభ్యుదయ వాది.సమాజ హితాన్ని కోరినవాడు.సమాజం బాగుండాలనికలలు
కన్నాడు.కలం పట్టాడు.నాటి ఛాందసభావాల లోకంలో కలకలం పుట్టించాడు.అభ్యుదయ మార్గానికి అడుగు జాడయ్యాడు.
“నాది ప్రజల ఉద్యమం.దానిని ఎవరినీ సంతోష
పెట్టడానికైనా వదులుకోలేను.నా ఆశయం ప్రజల ఆశయం.”.అంటూ ప్రజల కోసమే బతికిన మహా
నుభావుడు…గురజాడ!!!
*ఎ.రజాహుస్సేన్.