నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.తెరపైకి ఈ బిల్లులు..!!

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.తెరపైకి ఈ బిల్లులు..!!

నవంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.

ఈ సెషన్ లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా, వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు.

Parliament sessions from today

సభలో చర్చించేటువంటి అంశాలను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ముందుగానే పరిశీలిస్తారని తెలియజేశారు. వారు అనుమతించిన వాటి పైననే పార్లమెంటులో చర్చలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులు..

1. భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు, 2024

2. విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, 2024

3. గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు, 2024

4. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, 2024

5. ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, 2024

6. రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024

7. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024

8. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024

9. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024

10. చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, 2024

11. బాయిలర్స్ బిల్లు, 2024

12. రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు, 2024

13. పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, 2024

14. మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2024

15. కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024

16. ఇండియన్ పోర్ట్స్ బిల్లు, 2024

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *