నవంబర్ 16: ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీ లోని జనక్పురీ, నంగ్లోయ్లో లో 900 కోట్లు విలువైన 80 KGల కొకైన్ ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ కన్సైన్మెంట్ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి
అమిత్ షా ధ్రువీకరిస్తూ డ్రగ్స్ రాకెట్పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామని పేర్కొన్నారు.అలాగే అధికారులను అభినందించారు.