నవంబర్ 13: జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు 16, 17వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని జీ-20 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన గయానాకు వెళ్లనున్నారు. 21వ తేదీ వరకు అక్కడ పర్యటిస్తారు.
Posted inBlog