నవంబర్ 30:జామ పండు చలికాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్. ఈ సీజన్లో జామ పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జామ పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జామ పంటలో విటమిన్ సి అధికంగా ఉంటుంది..ఇది చలికాలంలో మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. మన రోగనిరోధక శక్తిని పెంచి మనం ఆరోగ్యంగా ఉండడానికి జామపండు ఎంతగానో దోహదం చేస్తుంది.
“జామపండుతో ఆరోగ్య ప్రయోజనాలు”
జామపండును తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది. జామ పండులో విటమిన్ సి మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జామపండును ప్రతిరోజు తినడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచేలా చేస్తుంది. జామ పండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది మన మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
బరువుకు, మధుమేహానికి జామపండుతో చెక్
జామ పండులో ఉండే ఫైబర్ మనం తినడం వల్ల మన కడుపు నిండుగా ఉన్నట్టుగా చేస్తుంది. దీనివల్ల మనం అదనంగా ఎక్కువగా తినకుండా ఉంటాము. ఫలితంగా బరువు తగ్గడానికి జామపండు ఎంతో బాగా దోహదం చేస్తుంది. జామ పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం బారినపడి బాధపడుతున్న వారికి అద్భుతమైన సేఫెస్ట్ పండుగా చెప్పవచ్చు.
మధుమేహ బాధితులు ఎలాంటి అనుమానాలు లేకుండా జామపండును తినవచ్చు..