నవంబర్ 30 హైదారాబాద్: హైదారాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని తన స్వగృహం లో కలిసి ములుగు నియోజకవర్గం లోకొత్తగా మల్లం పల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు గాను శాలువా తో సత్కరించి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారు
- ఈ సందర్భంగా మాట్లాడుతూ
- ఎన్నికల సమయంలో ఆనాడు టిపిసిసి అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే మల్లంపల్లి మండలం గా ప్రకటించడం సంతోషకరమని అదే విధంగా ములుగు నియోజక వర్గం పర్యాటక ప్రాంత అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వానికి యోనోస్కో గుర్తింపు పొందిన రామప్ప కు
- 73 కోట్ల 47 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని
- అదే విధంగా నిరుపేద కుటుంబాలకు ఐటిడిఎ ల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ ఉందని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు.
- ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు ఉన్నారు