నవంబర్ 25:
మనిషికి రెం డు జీవితాలుం టాయి. ఒకటి లౌకిక జీవితం. రెం డోది ఆధ్యా త్మి క జీవితం . లౌకిక జీవితం లో తన పుట్టుకకు కారణమైన తల్లిదం డ్రులు, తోబుట్టువులు, బం ధుమిత్రులు, చదువులు, ఉద్యో గాలు, పెళ్ళి ళ్లు, సాం సారిక బాధ్య తలు మొదలైనవి చేరిపోతాయి. వీటికి భిన్నం గా ఉం డేది ఆధ్యా త్మి క జీవితం. ఇది కేవలం వ్య క్తికి మాత్రమే సం బం ధిం చిం ది. దీని సాధనలో ఇతరుల ప్రమేయం ఉం డదు. అదెలాగం టే- తిం డి పదార్థం నోట్లో వేసుకున్న తరవాతగానీ, దాని రుచి తెలియదు. ఇతరులు దాని రుచిని వర్ణిం చి చెప్పి నా, వారు చెప్పిం ది నిజమో కాదో తెలియాలం టే స్వ యం గా తానే రుచి చూసి తెలుసుకోవాలి. ఆధ్యా త్మి క జీవితం కూడా ఇలాం టిదే.
మనిషి పుట్టిన తరవాత తాను జీవించడానికి కావలసిన సాధనాలను సమకూర్చు కోవడానికే కాలాన్ని వెచ్చి స్తాడు. ఆకలి ఒక్క టే మనిషిని కర్తవ్యం లోకి పరుగులు పెట్టిస్తుం ది. ముం దు తాను బతకాలి. ఆ తరవాత తన కుటుం బాన్ని పోషిం చుకోవాలి. ఆ తరవాతే సమాజం . ఇదీ మానవ జీవన విధానం . మనిషికి తన లౌకిక జీవనం పై ఎన్నో ఆశలుం టాయి. తాను ఆనం దం గా ఉం డాలని, తన సం తతి వృ ద్ధిలోకి రావాలని, సమాజం లో గౌరవాదరణలను పొం దాలని, బం ధుమిత్రుల సహాయ సహకారాలను అం దుకోవాలని కోరు కోవడం మానవ సహజ లక్షణం.
తన లౌకిక జీవనోన్న తి కోసం మనిషి ఎన్నో దారులు వెతుక్కుం టాడు. ఆ దారులు మం చివైతే మం చి ఫలితాలనిస్తాయి. కం టక మార్గాలైతే చేదు అనుభవాలనే మిగిలిస్తాయి. జీవితాం తం వరకు ఈ లౌకిక లం పటాలలోనే కాలం గడిపే మనిషి తన జీవిత పరమార్థానికి అవసరమైన ఆధ్యా త్మి క జీవితాన్ని గురిం చి ఆలోచిం చడం లేదు. జవసత్వా లన్నీ ఉడిగిపోయిన ముదిమి వయసులో ఆధ్యా త్మి క జీవితం గుర్తుకు వస్తుం ది. కానీ అప్ప టికే పుణ్య కాలం అం తా గడచిపోతుం ది కనుక చేసేదేమీ లేక చిం తాక్రాం తుడై అలమటిస్తాడు. శరీరం లో శక్తి సం పదలు ఉన్నం తకాలం గుర్తుకురాని ఆత్మ విచారం జీవన సం ధ్యా కాలం లో మనసును తొలుస్తుం ది. ‘అయ్యో ! ఈ సుకృ తం చేయలేకపోయానే, ఈ తపస్సు చేయలేకపోయానే, ఈ చిం తనను మరచిపోయానే’ అని వాపోవడం చూస్తుం టాం .
‘వయసు పెరుగుతోం ది’ అని అం దరూ అం టారు. వయసు పెరగడం కాదు, తరగడమేనని వేదాం తాలు చెబుతాయి. కాళిదాసమహాకవి రఘువం శం లో- ‘మనిషికి మరణం సహజం కాని, జీవనం సహజం కాదు. మనిషి చావకుం డా బతికి ఉన్నం తకాలం అతడు గొప్ప భాగ్య వం తుడే అనుకోవాలి’ అం టాడు.
మనిషి లోకం లో తన బతుకుతెరువు కోసం ఎన్నో పనులు చేస్తున్నా, అతడిలోని అం తరాం తరాల్లో వైరాగ్య భావం ఉం డాలి. లేకుం టే కనబడేదం తా శాశ్వ తం అనుకొని భ్రమకు ప్రమాదాలకు గురి అవుతాడు. ఏ క్షణం లో ఏదైనా జరగవచ్చు. మనిషి జీవితం అస్థిరం , క్షణికం అని వేదాం తుల మాట.
‘దీపం ఉం డగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి’ అనే సామెతను మనిషి సదా మననం చేసుకోవాలి. కేవలం లౌకికం గా బతకడం మాత్రమే కాదు- ఆత్మ శాం తికోసం ఆధ్యా త్మి క జీవితాన్నీ అలవాటు చేసుకోవాలి. ఆత్మో న్న తికోసం ప్రయత్నిం చాలి. ఆత్మా నం దాన్ని సాధిం చాలి. అప్పు డే మనిషి పుట్టుకకు ప్రయోజనం దక్కు తుం ది. –
మీ🙏శ్రేయోభిలాషి