అక్టోబర్ 18: మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్ కాలనీలోని పోచమ్మ తల్లి ఆలయంలో మహా శాంతి హారతి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు పాల్గొని అమ్మవారికి మహా శాంతి హారతి ని ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ
గత కొన్ని నెలలుగా హిందువుల అమ్మవారి ఆలయాల పై కక్షగట్టి మరి వరుసగా దాడులు చేస్తున్నారని మొదటగా రక్షాపురంలో, మైలార్‌దేవ్‌పల్లి లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, మొన్న సకింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో యావత్ హిందూ సమాజాన్ని కల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ఐక్యత చాటి చెప్పడానికి మరియు అమ్మవారి శాంతి కొరకు మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలలో మహా శాంతి హారతి నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీరామ్ కాలనీలో అమ్మవారికి మహా హారతిని ఇవ్వడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు అన్ని అమ్మవారి ఆలయాలలో మహా శాంతి హారతి నిర్వహించినందుకు హిందువుల ఐక్యతను చాటి చెప్పినందుకు శ్రీరాములు గారు హిందూ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా హిందువులకు ఏమైనా జరిగినప్పుడు అన్ని రాజకీయాలు పక్కన పెట్టి హిందువుల పక్షాన నిలబడి పోరాడాలని అలా పోరాడిన వాడే నిజమైన హిందువు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు మల్లేష్, బిజెపి ఉపాధ్యక్షులు సంతోష్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు హరికృష్ణ, సుమిత్, గణేష్, చించోలి, శ్రీనివాస్, నాగార్జున, ఆకాష్, మహేందర్, శివ, షేర్ సింగ్, మహిళామూర్తులు, హిందూ బంధువులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.