సెప్టెంబర్ 18: వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని చెప్పారు. మంగళవారం మిచిగాన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు పీఎం మోదీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో డెలావేర్లోని విల్మింగ్టన్ లో జరిగే నాలుగో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ పాల్గొంటారు.