సెప్టెంబర్ 28: రేషన్ కార్డు లేకున్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 27న ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయని తెలిపారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటు లోకి తీసుకొస్తామని అన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్/పర్సన్ ఇన్ చార్జి, గ్రామ కార్యదర్శి, ముగ్గురు సేవా కార్యకర్తలు ఉంటారని తెలిపారు.