సెప్ట్ఎంబర్ 13:తెలంగాణలో రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తోడు కొత్తగా ఆరుగురు మంత్రులు క్యాబినెట్ లోకి రానున్నారు.. అయితే ఈ 6 ఖాళీలకు చాలా మంది ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే .. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు రేసులో ఉన్నారు.
బీసీలలో బలమైన ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ తో పాటు కురుమ కోటాలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా రేసు లో ఉన్నారు. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ రేసు లో ఉన్నారు. అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ రేసు లో ఉన్నారు.
ఇక ఎస్టీ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే కేతావత్ బాలునాయక్ తో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ కూడా రేసులో ఉన్నారు. ఇక మైనార్టీ కోటా లో, ఎమ్మెల్సీ అమీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిలో కచ్చితంగా ఆరుగురికి మంత్రి పదవులు అయితే దక్కనున్నాయి. అయితే కోమటిరెడ్డి ఫ్యామిలీకి , వివేక్ ఫ్యామిలీకి ఇప్పటికే చాలా పదవులు ఉన్నందున వారికి ఎలా ? ఇస్తారు .. అన్న ప్రశ్నలు కూడా పార్టీ వర్గాల్లో ఉత్పన్నం అవుతున్నాయి.