పోలీసుల ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించిన డీజీపీ!

పోలీసుల ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించిన డీజీపీ!

హైదరాబాద్:సెప్టెంబర్ 11 ఇవ్వాళ తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహిం చారు. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒక్కరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు.మొత్తం రూ”11.06కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించి చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి, డిజిపీ జితేందర్, అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు తూ….ఆక్ర‌మ‌ణ‌ల‌ను విడిచిపెట్టి వెళ్లాల‌ని, లేదంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.చెరువులను చెరపడితే చేరసాలే అన్నారు.

ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదన్నా రు. ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులదేన‌న్నారు. సైనిక స్కూల్ తరహాలో పోలీసు లకు 50ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ప్రక్షాళన చెయ్యడానికే కొత్తకోటకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అప్ప‌గించామ‌ న్నారు. పోలీసులంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించాలన్నారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేన‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా యువత సక్రమమైన దారిలో నడవాలన్ని ఆకాంక్షించారు. ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, TGPSCలో అక్రమాలకు తావు లేకుండా ఆ సంస్థను ఇప్పటికే పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు.

ఈ ఏడాదిలోనే మరో 35 వేల ఉద్యోగల భర్తీ చేస్తా మన అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెలవేర లేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పనితీరుపై యువ కులకు ఎలాంటి అనుమా నాలు అక్కర్లేదని అన్నారు.

కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా చేరిన వారు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వ్యసనాలకు స్థానం ఉండకుండా చేయాలన్నారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *