సెప్టెంబర్ 16: నీ వల్ల ఏదీ సాధ్యం కాదు.. ఆత్మహత్య చేసుకోమన్నారు: పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత నవదీప్
పారాలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత జావెలిన్ త్రోయర్ నవదీప్ తన జీవితంలో పడ్డ కష్టాలు, అవమానాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “మరుగుజ్జుగా పుట్టిన నన్ను, నువ్వేం చేయలేవు. నీ వల్ల ఏదీ సాధ్యం కాదని అవమానించారు. నీకు ఇలాంటి జీవితం ఎందుకు? ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని మరి కొందరు వేధించారు. వారి నుంచే ప్రేరణ పొందా” అని ఆయన చెప్పారు. “ఈ క్రీడా ప్రపంచంలోకి వచ్చాక నా తండ్రి అడుగడుగునా నా వెన్నంటే ఉన్నారు” అని నవదీప్ తెలిపారు.