దీర్ఘాయుష్షు ఎలా లభిస్తుంది? ఒక చిన్న కథ అందరికోసం

దీర్ఘాయుష్షు ఎలా లభిస్తుంది? ఒక చిన్న కథ అందరికోసం

సెప్టెంబర్ 15:భీష్ముడు ఇలా బదులిచ్చెను, “ఓ రాజా! సత్ప్రవర్తన చేత ఒకరు దీర్ఘాయువును పొందుదురు. అట్లే పాపకార్యాల ఆచరణ ద్వారా ఆయుష్షు తరుగును. ఒకవేళ ఎవరైనను దీర్ఘకాలము జీవింపదలచినచో,ఎన్నడును సూర్యోదయము మరియు సూర్యాస్తమయాలను వీక్షింపరాదు.
గ్రహణ సమయాల్లో సూర్యుని చూడరాదు.
ఇతరుల భార్యలతో సంభోగించుట ద్వారా ఆయువు త్వరితగతిన క్షీణించును.
నిజమునకు, ఇతరుల భార్యతో సంభోగించినచో, ఆ స్త్రీ శరీరముపై ఎన్ని రోమాలు ఉండునో అన్నివేల సంవత్సరాలు నరకములో బాధలను అనుభవించవలసి ఉండును.”ఒక కాలుపై మరొక కాలును వేసుకొని కూర్చోరాదు.
యజ్ఞములో అర్పింప బడని మాంసమును భుజింపరాదు.
వికలాంగులను, అజ్ఞానులను, అందవిహీనులను, బలహీనులను, పేదవారిని మరియు దుఃఖములోని వారిని చూచి అపహాస్యము చేయరాదు.
ఆకాశములోని నక్షత్రాదుల వైపునకు వ్రేలును చూపరాదు.
అపరిశుభ్రమైన, పగిలిన అద్దములో తమ ప్రతిబింబమును చూచుకోరాదు.
ఉత్తర మరియు పడమర దిక్కులకు తలపెట్టి పడుకొనరాదు.
“నాస్తికునితో వాదించరాదు.
దిగంబరముగా స్నానమాచరించుట గాని శయనించుట గాని చేయరాదు.
మైలలో గల స్త్రీతో సంభాషించరాదు.
ఎన్నడును నిలుచుని గాని నడుచుకొంటూ గాని భుజింపరాదు. కేవలము కూర్చుని మాత్రమే భుజింపవలెను.
ఎన్నడును నిలుచుని మూత్రవిసర్జన చేయరాదు.
ఒకరు ఉదయము మరియు సాయంత్రము మాత్రమే భుజింపవలెను, మధ్యమధ్యన భుజింపరాదు.
పగటిపూట లేక స్త్రీమైలలో ఉన్నప్పుడు ఎన్నడును సంభోగములో పాల్గొనరాదు.

“పిల్లలతో, వృద్ధులతో మరియు సేవకులతో సన్నిహిత్యమును పెంచుకోరాదు.
సంధ్యాసమయములో ఎవరును నిద్రింపరాదు,
అధ్యయనము చేయరాదు, భుజింప రాదు.
ఈ సమయములో, ఒకరు తమ కార్యకలాపాల నన్నింటినీ నిలిపి ప్రార్థన మరియు ధ్యానాదులలో నెలకొనవలెను.
రాత్రి సమయములో ఒకరు అతిగా భుజింప రాదు, అట్లే అతిగా అతిథి మర్యాదలకు పోయి అతిథిని ఎక్కువగా భుజించునట్లుగా బలవంతపెట్టరాదు.
ఎన్నడును స్త్రీకి హాని కలిగించరాదు.
పగటిపూట నిద్రించువారు లేక పాపకార్యములో పాల్గొనువారు తమ ఆయుష్షును కోల్పోవుదురు.
యజ్ఞ యాగాదులకు ఆహ్వానము లేకుండ వెళ్ళినచో, ఒకవేళ యజమాని అతడిని ఉచితరీతిన గౌరవింపకున్నచో జీవితపరిమాణము క్షీణించును.

“ఓ యుధిష్టిరా! సత్ప్రవర్తన అనేది తాత్త్విక సిద్ధాంత జ్ఞానము లన్నింటిలోకి అత్యున్నతమైనది. కనుక తమ సంతానముకు సత్ప్రవర్తనను బోధించు తల్లి వేదాలను బోధించు గురువుకు సమానము. ఎందుకనగా, ఆమె సంతానమును పెంచుటకు అన్నిరకాల అసౌకర్యాలను సహించును. అందుచేత, భౌతిక దృష్టిలో తల్లి మానవ సమాజములో గొప్ప మాన్యనీయురాలు.
మీ🙏శ్రేయోభిలాషి

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *