హైదరాబాద్: తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్ ఛైర్మన్, సభ్యులను త్వరలో నియమించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.