సెప్టెంబర్ 16:ములుగు జిల్లా కన్నాయిగూడెం మండంలం బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతించదు. ఈ తండాలోని పిల్లలు చదువుకోవడానికి కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించి కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిధుల రూ.13 లక్షలతో 12 డ్యూయల్ డెస్కులతో పాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. ఈ కంటైనర్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది.