సెప్టెంబర్ 12: ఏపీలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీవిద్యుత్ ఇంజినీర్ల అసోసియేషన్, విద్యుత్ ఉద్యోగుల ఐకాస సంయుక్తంగా రూ.10,61,18,694 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు అసోసియేషన్, ఐకాస నేతలు
సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. ఈ విరాళం అందజేసిన విద్యుత్ ఉద్యోగులను సీఎం
అభినందించారు.