సెప్టెంబర్ 16: ఇక నుంచి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.1,000 జరిమానా చెల్లించాల్సిందే.వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. ఈ డ్రైవ్‌లో ప్లేట్ లేని వాహనాల యజమానులకు మొదటి నేరానికి రూ.500.. రెండో సారి పట్టుబడితే.. రూ.1000 జరిమానా విధించనున్నారు. కాగా, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లను తప్పనిసరి చేసి.. ఇన్‌స్టాలేషన్‌ను పాటించాలని వాహన యజమానులను కోరుతోంది.