పహాడిషరీఫ్,సెప్టెంబర్ 7: వినాయ కచవితి వచ్చిందంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్ వినా యకుడు. బాలాపూర్ వినాయకుడిని అది వినాయకుడన్ని అక్కడి నుంచే ఉత్సవాలు ప్రారంభం కావడంతోపాటు. నిమజ్జన ఊరేగింపు కూడా అక్కడి నుంచే మొదలవుతుం డడం విశేషం. పదకొండు రోజులపాటు పూజించిన వినా యకుని చేతిలోని లడ్డూను వేలం వేయడం, ఆ లడ్డూ లక్షల్లో పలకడంతో ప్రపంచంలోని హిందూ సోదరులు నిమజ్జనం రోజున బాలాపూర్ లడ్డూ వేలంపాటను వీక్షి స్తారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోని 1994లో రూ.450కి ప్రారంభమైన లడ్డూ వేలంపాటు గత సంవత్సరం,2022 లో 24లక్ష ల 60 వేలు,2021లో రూ.18.90 లక్షలు పలకడం ఆ లడ్డు, విశిష్టతను తెలియజేస్తుంది. లడ్డూ వేలంపాటలో స్థాని కులు కాక స్థానికేతరులు కూడా పాల్గొని లడ్డూను దక్కిం చుకుంటున్నారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో నిర్వాహకులు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. ఇప్పటివరకు లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బు తో నిర్వాహకులు ఇప్పటివరకు ఒక్క కోటి నలుబాయ్ నాలుగు లక్ష ల దెబ్బాయి ఒక్క వేయి తొమ్మిది వందల దెబ్బాయి రూపాయలు (1,44,71,970 )ఖర్చుచేసి స్థానికంగా ఆలయాల అభివృద్ధి, షెడ్డు నిర్మాణం, బోరు, వరద బాధితులకు సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టారు.లడ్డూ వేలం పాటలో బాలాపూర్ గణేష్ లడ్డుకు తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. మొట్ట మొదటిసారిగా గణనాథున్ని బాలాపూర్ గ్రామస్థులు 1980లో గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్‌లో ప్రారంభమయిన గణేష్ లడ్డుకు దేశ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు లభించింది. బాలాపూర్ గణేష్ లడ్డుకి 30సంవత్సరాల ఘన చరిత్ర కలిగి ఉంది. 2020లో కరోనా కారణంగా లడ్డు వేలం పాటకి మొట్టమొదటి సారి బ్రేక్ పడింది. దీంతో బాలాపూర్ గణేష్ లడ్డును 2020లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుకరించినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కదిలే తొలి వినాయకుడు బాలాపూర్ గణపతి. గణేష్ నిమజ్జనం సామూహిక ఊరేగింపు రోజున తెల్లవారు జామున బాలాపూర్ గణేష్ ప్రతిమను గ్రామంలో ఊరేగిస్తారు. ఉదయం 9గంటలకు బాలాపూర్ బొడ్డురాయి ప్రాంతంలో వేలం పాట అంగరంగవైభవంగా ప్రారంభం అవుతుంది. 21 కిలోల లడ్డు 1116 రూపాయలతో వేలం పాట ప్రారంభం అవుతుంది. వేలం పాటలో పాల్గొనడానికి నగర శివార్ల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి బాలాపూర్ కు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు.:ఒక్క కోటి 44లక్షల 7 1వేల970 రూపాయలతో బాలాపూర్ గ్రామంలో అభివృద్ది పనులు::వేలం పాట ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బాలాపూర్ గ్రామ అభివృద్దికి వినియోగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.బాలాపూర్ గణనాథుడు ఈ సంవత్సరం విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనమివ్వనున్నాడు.అయోధ్య రామాలయం ఆకృతిలో భారీ గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ కు చెందిన కళాకారుల బృందం గత పది రోజులుగా ఈ మండప ఏర్పాటులో నిమగ్నమైనారు. , 18 ఫీట్ల ఎత్తులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
వేలం పాటలో గణేష్ లడ్డును సొంతం చేసుకుంది వీళ్లే …
1994లో జరిగిన బాలాపూర్ లడ్డు వేలం పాటలో కొలన్ మోహన్‌రెడ్డి రూ. 450 కైవసం చేసుకున్నారు. 1995లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 4500, 1996లో కొలన్ క్రిష్ణారెడ్డి రూ.18వేలు, 1997లో కొలన్ క్రిష్ణా రెడ్డి రూ.28వేలు, 1998లో కొలన్ మోహన్ రెడ్డి రూ.51వెయ్యి, 1999లో కళ్లెం అంజిరెడ్డి రూ. 65 వేలు, 2000లో కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ. 66వేలు, 2001లో జి.రఘునందన్ చారి రూ. 85వేలు, 2002లో కనడ మాధవరెడ్డి రూ.ఒక లక్ష 5 వేలు, 2003లో చిగిరింత బాల్‌రెడ్డి రూ.ఒక లక్ష55వేలు, 2004లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 2లక్షల ఒక వెయ్యి, 2005లో ఇబ్రం శేఖర్ రూ. 2లక్షల 8 వేలు, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ. 3లక్షలు, 2007లో జి.రఘునందన్ చారి రూ. 4లక్షల15 వేలు, 2008లో కొలన్ మోహన్ రెడ్డి రూ.5లక్షల 7వేలు, 2009లో సరిత రూ. 5లక్షల10వేలు, 2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ. 5లక్షల35వేలు, 2011లో కొలన్బ్రదర్స్ రూ. 5లక్షల45వేలు, 2012లో పన్నాల గోవర్థన్ రెడ్డి రూ. 7లక్షల50వేలు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9లక్షల26 వేలు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9 లక్షల50వేలు, 2015లో కళ్లెం మాధవ మోహన్ రెడ్డి రూ. 10లక్షల32వేలు, 2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14లక్షల 65 వేలు, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల60 వేలు, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్త రూ. 16లక్షల60 వేలు, 2019లో కొలన్ రామ్ రెడ్డి రూ.17లక్షల60 వేలు బాలాపూర్ లడ్డును వేలం పాటలో సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు. 2020లో కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు. దీంతో ఆ యేడు గణేష్ లడ్డును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహకురించారు. 2021లో 18లక్షల 90వేలకు మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు.2023లో ఇరువై ఏడు లక్ష లకు దక్కించుకున్నారు:భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేస్తున్నాము, కళ్లెం నిరంజన్ రెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు ::
బాలాపూర్ గణేష్ ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పారట్లు చేస్తున్నామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి అన్నారు, గణేష్ ఉత్సవ సమితి పది రోజుల పాటు ఉదయం 7నుంచి 10గంటల వరకు పూజలు సాగుతాయని ప్రతి రోజు భజన, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తరన్నారు, బాలాపూర్ గణేష్ ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు
::భారీ బందోబస్తు, ఇన్స్పెక్టర్ భూపతి ::
గణేష్ ఉత్సలను పునస్కరించుకొని బాలాపూర్ గణేష్ మండపం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి అన్నారు,బాలాపూర్ కు వచ్చే అన్ని రహదారుల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేశామని ఊరేగింపు వెళ్లే మార్గాలలో బడంగ్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి మున్సిపాలిటి, జి హెచ్ ఎం సి అధికారులతో చర్చించి రోడ్డు మార్గాల లో రోడ్లు విధి దీపాలు ఏర్పాటు చేయించామన్నారు