హైదరాబాద్ ఆగస్టు 31 :
ఈరోజు హైదరాబాద్ నగరంలో కుంభ వృష్టి కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ఈముడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.