వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణాలపై పడుతాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా.. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రామ్‌నగర్‌లోని మణెమ్మ కాలనీలో అడుగుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే మణెమ్మ కాలనీలోని నాలాపై నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాలను పరిశీలించారు.
తమ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని భవన యజమాని రాజు అన్నారు. ఇన్నేండ్ల నుంచి ఇక్కడ రోడ్డు ఉందని ఏ అధికారీ చెప్పలేదని, ఇప్పుడు వచ్చి కూలగొడుతున్నారని చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వాపోయారు.