ఆగస్టు 22:పరగడుపున నానబెట్టిన కొత్తిమీర విత్తనాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది
ప్రతిరోజు ఉదయం పరగడుపున నానబెట్టిన కొత్తిమీర విత్తనాల (ధనియాలు) నీరు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర విత్తనాల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. రక్తంలోని చక్కెర స్థాయిని, అలాగే శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా కిడ్నీల సామర్థ్యాన్ని పెంచి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తినిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.