మన ఆలోచన బట్టి మన నడక మొదలవుతుంది. ఏదైనా ఒక పని సాధించాలి అనుకుంటే ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గొప్ప గొప్ప నాయకులు వాళ్ళు ఎలా ఎదిగారు అన్నది మనము తెలుసుకుంటే మన జీవితంలో కొన్ని విజయాలు సాధించవచ్చు. ప్రతి ఒక్కరి విజయమేనుక ఎంతో కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని మనం దాటితే ప్రతి ఒక్కరూ విజయం సాధించగలరు. మన జీవితంలో లక్ష్యం మనం అన్ని సాధించలేకపోయినా వాటి లో కొన్ని నెరవేర్చుకోగలం కష్టం సుఖం దుఃఖం బాధ అన్ని చేదిస్తేనే విజయానికి మనం దగ్గరవుతాం. మనం వెళ్లే దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు వెళితే ఎంతటి పెద్ద కష్టానైనా అవలీలగా దాటగలం.