“అనంత జనశక్తి న్యూస్” AP&TGసంధ్య వలల్లో చిక్కుకున్న ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మంది.తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది.. దీంతో అతను అడగగా సంధ్య చంపేస్తానని బెదిరించింది.దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులో తీసుకొని విచారిస్తే అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తెలిసింది.